Home » » బిగ్ డేటా అంటే ఏమిటి

బిగ్ డేటా అంటే ఏమిటి

ఒక సంస్థ మార్కెట్లో నిలువాలన్నా.. వినియోగదారుల మన్నన పొందాలన్నా.. వారి అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటూనే వ్యాపారంలో కొత్త పద్ధతులను అనుసరించడం తప్పనిసరి. అలా ముందుకు వెళ్లాలంటే వ్యాపారులు తీసుకొనే నిర్ణయమే ప్రధానమైనది. అలా నిర్ణయాలు తీసుకోవడానికి బిగ్ డేటా అనలిటిక్స్ అవకాశం కల్పిస్తున్నది.

బిగ్ డేటా అనే పదాన్ని సాధారణంగా సాంప్రదాయక సాఫ్టువేర్లు భరించలేనంత పెద్దమొత్తంలో డేటాను సూచించడానికి వాడుతున్నారు. ఇందులో ప్రధాన సమస్యలు అంత పెద్ద మొత్తంలో డేటాను ఒడిసి పట్టడం, భద్రపరచడం, విశ్లేషించడం, శుద్ధి చేయడం, వెతకడం, పంచుకోవడం, బదిలీ చేయడం, అందులోని సమాచారం కోసం ప్రశ్నించడం,

1990ల తర్వాత సమాచార, సాంకేతిక రంగాల్లో మార్పుల వల్ల ప్రజల జీవనవిధానాల్లో రోజురోజుకూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శాటిలైట్లు, విమానయాన (ఎయిర్‌లైన్స్) సంస్థలు, బ్యాంకింగ్, వెబ్‌సర్వర్స్ నుంచి పెద్ద మొత్తంలో డేటా క్రియేట్ అవుతున్నది. దీంతో సమాచార, ఆర్థిక, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఈ-కామర్స్ రంగాల్లో సమాచార విశ్లేషణకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది.

-ప్రస్తుతం ఉన్న డేటా గత 15 ఏండ్లుగా ఉన్నదే. ఈ పదిహేనేండ్లలో ఒక సంస్థకు చెందిన మొత్తం డేటా 10 టెరాబైట్స్ (1,000 జీబీ) కంటే ఎక్కువ లేదు. కానీ, ప్రస్తుతం ఒకే రోజులో 10 టెరాబైట్స్ డేటా ఉత్పత్తి అవుతుంది. 2020 నాటికి ఇది జెటాబైట్లకు చేరనున్నది.
-భవిష్యత్‌లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించేవారు అధికమై రోజువారీ లావాదేవీలు ఆన్‌లైన్‌లో, ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతాయి. ఇలా పెద్దమొత్తంలో జనరేటవుతున్న డేటాను సేకరించడం, స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం కంపెనీలకు కష్టమవుతున్నది. ఈ డేటాను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడమే బిగ్ డేటా అనలిటిక్స్.

-ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఆయా కంపెనీలు తమకు సంబంధించిన అనేక ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటన్నింటి లక్ష్యం ఒక్కటే.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తు, సేవలు అందించి వారి మనసు గెలుచుకోవడం. దీనికోసం విభిన్న వర్గాల వినియోగదారులు, మారుతున్న వారి అవసరాలు, అభిరుచులకు సంబంధించి విశ్లేషణలు, సూచనలు, సలహాలతో కూడిన నివేదికలను రూపొందించి సంస్థకు అందించడం డేటా అనలిటిక్స్ ప్రధాన విధి. దీనికోసం వారు అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ పద్ధతులను ఉపయోగించి విశ్లేషిస్తారు. కంపెనీ వ్యాపార అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు.

-మనం షేర్ మార్కెట్‌లో ఒక కంపెనీకి చెందిన షేర్ కొనాలనుకుంటే... ఆ షేర్ విలువ ఏడాది క్రితం ఎంత ఉంది? ఆర్నెళ్ల క్రితం ఎంత ఉంది? వారం క్రితం ఎంత ఉంది? అనేదాన్ని తెలుసుకోవాలి. దీంతో భవిష్యత్‌లో ఆ షేర్ విలువ ఎలా ఉంటుంది? లాభాల్లో ఉంటుందా లేదా నష్టాల్లో ఉంటుందా? అని అంచనా వేసుకొని ఆ షేర్‌ను కొనుగోలు చేస్తారు.


Tags: Big Data in telugu, What is big data, 
Share this video :

0 comments:

Post a Comment

 
Copyright © 2013. TELUGU SHORT FILMS | Submit Here | HD Short Movies - All Rights Reserved