Home » » SRINU PANDRANKI - MAKES 4 IDEAS OF PURI INTO SHORT FILMS

SRINU PANDRANKI - MAKES 4 IDEAS OF PURI INTO SHORT FILMS


పూరి జగన్నాథ్ జనవరి పది లోపు మొత్తం పది టాస్క్ లు/ఐడియా లు ఇచ్చి ఏదైనా ఒక దానిని షార్ట్ ఫిలిం చేయమని చెప్పారు. ఫెబ్రవరి 14 లోపు అన్నీ సబ్మిట్ చేయాలి. నాకు అందులో రెండు నచ్చలేదు కాబట్టి మిగతా ఎనిమిది చేద్దమనుకున్నాను.నెలలో ఎనిమిది చేయడం కష్టమన్నారు అంతా..సరే ముందసలు మొదలు పెడితే ఎన్ని అయితే అన్ని అవుతాయి అనుకున్నాను. ఎనిమిదింటికీ స్క్రిప్ట్స్ రెడీ అయిపోయాయి. ప్రొడ్యూసర్స్ ని పట్టుకోవాలి. ఈలోగా మీరేమైనా చేస్తున్నరా అని Praneeth Palety వచ్చారు. నిజానికి ఆయనికి డైరెక్టర్ అవ్వాలని కోరిక. కానీ నన్ను encourage చేయడానికి ప్రొడ్యూసర్ అవతారం ఎత్తారు. మీరెంత పెడతారు అని అడిగాను. ఆయన చెప్పారు. ఆ బడ్జెట్ లో అయితే మీకు నేను నాలుగు చేసి పెట్టగలను అన్నాను. దానికి ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ నాలుగు షార్ట్ ఫిలిమ్స్ ఇవి. మిగతా నాలుగింటికి కూడా ప్రొడ్యూసర్స్ వచ్చారు. Harsha Vardhan, Prasad Kunisetty, Dheeraj Kanna డబ్బులు కూడా పంపించేసారు. అయితే నాకు నా ఫ్రెండ్ పెళ్లి పడింది. అలాగే ఇంట్లో ఒక పని కూడా. ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ముఖ్యం అనుకుంటానో, పర్సనల్ లైఫ్ కూడా అంతే ముఖ్యం అనుకుంటాను కనుక, వారం రోజులు మా ఊరు విజయనగరం వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ఆ మిగతా నాలుగు చేయలేకపోయాను. డబ్బులు పంపిన వారు పెద్ద మనసుతో అర్ధం చేసుకుని ఆ డబ్బులని నా తదుపరి షార్ట్ ఫిలిం లో కలిపెసుకోమన్నారు. ఆ విధంగా నేను నెలలో కేవలం నాలుగు మాత్రమె చేశాను. మీరు బతికిపోయారు. tongue emoticon
పూరి జగన్నాథ్ ఇచ్చిన ఐడియాస్ ప్రకారం...
IDEA 3 - MMS
ఒకమ్మాయి స్కూటీ మీద వెళ్తుండగా ఆమె ఫోన్ కింద పడిపోతుంది. అది ఒకబ్బాయి తిరిగి చేతికి ఇస్తాడు. ఇక్కడ నుండి కథ మలుపు తిరగాలి మరియు ఫోన్ చుట్టూ తిరగలి.
ఇది అయన ఇచ్చిన ఐడియా. దీనిని అందరూ ప్రేమ కథ చేస్తారు అని నాకు తెలుసు. అందుకని నేను క్రైమ్-కామెడీ ట్రై చేశాను.
IDEA 5 - UNSPOKEN
మాటలు లేకుండా ఏదైనా ప్రేమ కథ చెప్పమని అడిగారు. అంతకు మించి ఏం చెప్పలేదు. మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు కాకపోతే మూఖీ ప్రేమ కథ అయ్యి ఉండాలి.
అప్పుడే నాకు రామోజీ ఫిలిం సిటీ లో ఏదైనా ట్రై చేద్దామని అనిపించి అప్పితకప్పుడు దీని కథ అల్లాను.
IDEA 6 - PSEUDOCIDE
ఏదైనా బూత్ బంగ్లా లేదా గోల్కొండ లాంటి ప్లేస్ లో షార్ట్ ఫిలిం చేయమని అడిగారు. అది ఏదైనా కావొచ్చు. మన ఇష్టం.
సాదారణంగా ఇలాంటి ప్రదేశాల్లో అందరూ థ్రిల్లర్/హారర్ ప్రయత్న్సిస్తారు కాబట్టి నేను కొట్టగా ట్రై చేయడానికి చాలా ఆలోచించాను. ఈ టాస్క్ ఏ నేను ఎక్కువ ఆలోచించాను. సుమారు మూడు రోజుల తర్వాత pseudocide ఆలోచన తట్టింది. కానీ లొకేషన్ దొరకలేదు. చాలా వెతికాము. చివరికి మా సినిమాటోగ్రాఫర్ దిల్సుఖ్ నగర్ దగ్గరలో పట్టుకోగలిగాడు. కొన్ని ఇబ్బందుల వలన అయిదు గంటల్లో చేయాల్సి వచ్చింది. నేను అనుకున్న చాలా షాట్స్ తీయలేకపోయాను. కానీ ఉన్నదాంతో ఎడిటింగ్ లో మేనేజ్ చేశాను.
IDEA 8 - UPMA TINESINDI
దీనికి కథ పూరి ఇచ్చేసారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ ప్రేమలో పడతారు. కొన్నాళ్ళు సహజీవనం చేసాక ఒక కారణంతో గొడవ పడి విడిపోతారు. ఆ గొడవ చాలా ఫన్నీగా ఉండాలి. వీళ్ళిద్దరూ విడిపోవడం కరెక్ట్ అనిపించాలి.
ఇది ఆయన ఇచ్చిన టాస్క్. సిల్లీ రీజన్ కోసం చాలా ఆలోచించాను. అదే సమయంలో నా అసిస్టెంట్ ఆదిత్య 'ఉప్మా తినేసింది' ఆలోచన చెప్పాడు. బాగుందనిపించి స్క్రీన్ ప్లే బాధ్యత తనకే ఇచ్చేశాను. తర్వాత కొన్ని మార్పులు చేసుకుని తీసేశాను.
ఈ విధంగా ఆ నెల రోజుల్లో తీసిన ఆ నాలుగు సినిమాలనే అప్పుడప్పుడూ వదులుతూ వచ్చాను. నా ఈ ప్రయత్నం నాకు బాగా తోడ్పడిన వారి గురించి చెప్పాలి.
Share this video :

0 comments:

Post a Comment

 
Copyright © 2013. TELUGU SHORT FILMS | Submit Here | HD Short Movies - All Rights Reserved