Home » » LYRICS POETRY BY SUZZANNE SUZI IN TELUGU FONT - inthaki mee manasela undi

LYRICS POETRY BY SUZZANNE SUZI IN TELUGU FONT - inthaki mee manasela undi



అడిగి చాలా రోజులయ్యింది ఇంతకీ మీ మనసెలా ఉంది?
ఆకతాయిలా అల్లరి చేస్తోందా
పసిపిల్లలా గొంతెమ్మ కోర్కెలు కోరుతోందా

మొండి ఘటంలా మాట వినను అంటుందా
లేక నిశ్చలంగా పారే సెలయేరులా ఉందా

కన్నె పిల్ల పరువంలా పరవళ్ళు తోక్కుతుందా
ఏమంటుంది మీ మనసు.... అన్ని అనుభూతులను ఆస్వాదించే మీ మంచి మనసు

నా మనసు మాత్రం చెయ్యాల్సిన పనులు బోల్డు ఉన్నాయి
ఒకటొకటిగా విడదీసి... ఒకొక్కటి పూర్తి చెయ్యమని ముద్దుగా చెబుతుంది

మరి మీ మనసో? ... @ Suzzaanne.



Share this video :

0 comments:

Post a Comment

 
Copyright © 2013. TELUGU SHORT FILMS | Submit Here | HD Short Movies - All Rights Reserved