Home » » COMMUNICATION IS KEY TO SUCCESS in Telugu By Suzanne Suzi

COMMUNICATION IS KEY TO SUCCESS in Telugu By Suzanne Suzi

COMMUNICATION IS KEY TO SUCCESS in Telugu By Suzanne Suzi


మాటే మంత్రము!
నిజం! మనం మాటాడే ప్రతి మాట మంత్రమే
ప్రతి పలుకు ఒక శుభ తంత్రమే
మనం గుండెలోతుల నుండి పలికే ప్రతి మాట మహత్తు కలదే
ప్రతి మాటలోనూ ఉన్నది ఏదో ఒక తాత్పర్యమే
మనసులోని బాధని చెప్పుకోవడానికి
సంతోషాన్ని విప్పి పంచుకోవడానికి
మదిలోని అనుభూతులను విన్నవించడానికి
ఎన్నో క్రియలు సవ్యంగా సాగడానికి
అవును మాటే మంత్రము
సమయానికి అనుకూలంగా
సందర్భానికి తగినట్టుగా
అవసరానికి సరిపడేట్టుగా
సామరస్యం పొంగేట్టుగా
మనషుల స్పందనల సమ తూకంతో మాటాడే ప్రతి మాట విలువైనదే
నొప్పించక తానొవ్వక
అపార్థానికి తావివ్వక
అపరిష్కృత భావానికి దారి కాక
చిక్కుముడులని వేసేది కాక
స్పష్టమైన, తేటైన, ఇంపైన సొంపైన మంచి మాటలు అందరికీ సమ్మతమే
అందుకే మాటే మంత్రము
మానవ సంబంధ బాంధవ్యాలను పెంచే అత్యద్భూత తంత్రము ...@ Suzzaanne

RELATED POSTS:
Inthaki Mee Manasu Ela Undhi
Share this video :

0 comments:

Post a Comment

 
Copyright © 2013. TELUGU SHORT FILMS | Submit Here | HD Short Movies - All Rights Reserved