Home » » AMMAYI LENIDE PRAPANCHAM LEDHU By R SANTHI PRIYA Nov 2014

AMMAYI LENIDE PRAPANCHAM LEDHU By R SANTHI PRIYA Nov 2014

అమ్మాయి లేనిదే – ప్రపంచం లేదు- ఆర్‌.శాంతిప్రియ

అక్టోబర్‌ 11, అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ మరియు తరుణి సంస్థ వారు సంయుక్తంగా ”బాక్‌ధాన్‌” (బైక్‌ ర్యాలీ)ని నిర్వహించారు. ఈ బైక్‌ ర్యాలీలో భూమిక నుండి సరిత, శాంతిప్రియ పాల్గొన్నారు.
మన రాష్ట్రంలో, ముఖ్యంగా హైద్రాబాద్‌లో లింగ నిష్పత్తి (ఐలిని ష్ట్రబిశిరిళి) చాలా తగ్గుతోంది. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. కావున అమ్మాయిలను కాపాడాలి. ముఖ్యంగా అమ్మాయిలను పుట్టుకలోనే చంపకుండా వుండడానికి కావలసిన అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్రాల వారీగా లింగ నిష్పత్తి చూసినట్లయితే మన రాష్ట్రంలో 2001లో వెయ్యి మంది బాలురకు 900 బాలికల కన్నా తక్కువగా ఉన్న మండలాలు కేవలం 12 ఉండగా 2011 నాటికి పరిస్థితి తారుమారై అవికాస్తా 62 మండలాలైనాయి. ఇంకోపక్క  మనరాష్ట్రంలో స్కానింగ్‌ సెంటర్లు 4000 నుండి 6000 పైచిలుకే పెరిగాయి. అర్హతగల డాక్టర్లు పరీక్షలు జరపకుండా, టెక్నీషియన్లే బాలికల జీవితాన్ని నులిమివేయగలగిన సులభమైన సౌకర్యవంతమైన పరిస్థితులకి ఎదిగిపోయాం! ఈ విషయంలో నిరక్షరాస్యులైన పేద గ్రామీణులకంటే, చదువుకున్న పట్టణవాసులే ఈ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకొని ఆడ శిశువుల్ని హతమార్చటంలో ముందుంటున్నారనేది దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం.
ఆడశిశువుల మృత్యునాదాలు ప్రమాద ఘంటికలై మ్రోగుతున్నా మనం బధిరత్వాన్ని నటిస్తుంటే భావితరాలకు మనుగడ లేదనే వాస్తవాన్ని అందరం ఇప్పుడే గుర్తించి అత్యవసర చర్యలు చేపట్టాల్సి వస్తుంది.
ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలూ, పౌర సమాజం యావత్తూ కదిలి ఒక్కటై నిలిచి ఆడపిల్లల పట్ల సమాజానికి వున్న నెగిటివ్‌ మైండ్‌సెట్‌ మార్చేందుకు ఉద్యమించాలి. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మహిళా గ్రూపులు, యువజన రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇలా సమస్త రంగాలకి ”ఆడపిల్ల రక్షణ” అనేది ప్రధాన బాధ్యత కావాలి.
ఈ ఉద్దేశ్యంతో తరుణి స్వచ్ఛంధ సంస్థ ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎం.పి. కవితగారు, మాజీ పోలీస్‌ కమీషనర్‌ (హైద్రాబాద్‌) ఏ.కె. ఖాన్‌గారు, ఫారెస్ట్‌ అకాడెమీ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ రఘువీర్‌గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు.
ర్యాలీ ప్రారంభం కావడానికి ముందు హెచ్‌.పి.ఎస్‌ విద్యార్థులు, శివశివానీ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు, ఫారెస్ట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువ క్యాడర్‌ మరియు కొంతమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో ”మేమంతా మా మా జీవితాల్లో ఆడపిల్లల రక్షణ కోసం మనస్ఫూర్తిగా కృషిచేస్తాం” అని ప్రతిజ్ఞ చేయించారు.
పెద్దలందరూ ఆడపిల్లలను రక్షించుకోవలసిన ఆవశ్యకత గురించి చేపట్టవలసిన చర్యల గురించి ఉపన్యసించారు., అనంతరం 200మంది బైకర్స్‌ ”నో గర్ల్స్‌ నో వరల్డ్‌” అనే స్టిక్కర్లు బైక్‌పై అంటించుకొని, ప్లెకార్డ్స్‌ పట్టుకొని పాంప్లెట్స్‌ పంచుతూ నినాదాలు చేస్తూ… బేగంపేట పబ్లిక్‌ స్కూల్‌ నుండి కొంపల్లి ఫారెస్ట్‌ అకాడమీ వరకు రహదారిపై బైక్‌ ర్యాలీ చేసారు. ఒక్కసారి రోడ్డుపై  ప్రయాణీకులందరి దృష్టిని మళ్ళించి ఆలోచన రేకెత్తించే విధంగా ఈ ర్యాలీ సాగింది.tags: women, writers, telugu, sahityam, poetry, real , stories, poets, scripts, dialogulu, kathalu, shtrilu, samasyalu, 
Share this video :

0 comments:

Post a Comment

 
Copyright © 2013. TELUGU SHORT FILMS | Submit Here | HD Short Movies - All Rights Reserved